మంత్రి పీఏ హౌస్‌ కీపర్ ఇంట్లో ‘నోట్ల గుట్టలు’.. రూ.25 కోట్లు సీజ్ చేసిన ఈడీ

-

లోక్సభ ఎన్నికల వేళ ఝార్ఖండ్లో ఈడీ సోదాలు కలకలం రేపాయి. ఆ రాష్ట్ర మంత్రి ఆలంగీర్ ఆలం పీఏ పనిమనిషి ఇంట్లో ఈడీ అధికారులు దాడులు నిర్వహించగా అక్కడ కనిపించిన నోట్ల గుట్టలు చూసి షాక్ అయ్యారు. దాదాపు రూ.25 కోట్ల నగదును జప్తు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఈ డబ్బు మంత్రి పీఏ సంజీవ్ లాల్కు చెందినదని పని మనిషి జహీంగీర్ ఆలం వెల్లడించారు.

ఝార్ఖండ్లోని పలు చోట్ల ఈడీ అధికారులు ఈరోజు సోదాలు జరుపుతున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖలో కొన్ని పథకాల అమలులో అవకతవకలు జరగడం వల్ల ఈ వ్యవహారంపై మనీ లాండరింగ్ కేసు నమోదు కాగా ఈ వ్యవహారంలో గతేడాది ఫిబ్రవరిలో గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర రామ్ను ఈడీ అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి జరుగుతున్న విచారణలో భాగంగా ఈడీ మరోసారి రాంచీలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. వీరేంద్రకు చెందిన 10కి పైగా ప్రాంతాల్లో ప్రస్తుతం సోదాలు జరిపారు. ఈ క్రమంలోనే అధికారులు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంఘీర్‌ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్‌ లాల్‌కు సహాయకుడికి చెందినదిగా భావిస్తోన్న ఇంట్లో తనిఖీలు చేయగా ఒక గదిలో కరెన్సీ కట్టలు పేర్చి ఉండటం గమనించారు.

Read more RELATED
Recommended to you

Latest news