మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు అస్వస్థత నెలకొంది. మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి షిండే ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో ఠానేలోని ఓ ఆసుపత్రికి తరలించారు. గడిచిన 3 రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే. అయితే.. ఇవాళ ఏక్నాథ్ షిండేకు అస్వస్థత నెలకొంది.
దీంతో ఠానేలోని ఓ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు, మహారాష్ట్ర సీఎం పీఠంపై ఇంకా వీడలేదు సందిగ్ధత. కాగా, మహారాష్ట్రలో డిసెంబర్ 5న మహాయుతి కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని బీజేపీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. గతంలో రెండు సార్లు సీఎంగా, ఒకసారి డిప్యూటీ సీఎంగా పనిచేసిన దేవేంద్ర ఫడ్నవీస్.. ఇప్పుడు మరోసారి సీఎం రేసులో ముందంజలో ఉన్నారని తెలిపారు. ఆయనే మహారాష్ట్ర తదుపరి సీఎంగా బాధ్యతలు చేపడతారని బీజేపీ నేత తెలిపారు.