వాషింగ్ మెషీన్‌లో రూ.2.5 కోట్ల నగదు.. స్వాధీనం చేసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం

-

విదేశీ మారకద్రవ్య చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గత కొద్ది రోజులుగా ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, కోల్‌కతా, హర్యానాలోని కురుక్షేత్రలో దాడులు నిర్వహిస్తున్నారు. Capricornian Shipping and Logistics Pvt Ltd, Laxmiton Maritime, Hindustan International. రాజనందిని మెటల్స్ లిమిటెడ్ సహా పలు కంపెనీల ప్రాంగణాలు, ఆయా కంపెనీల డైరెక్టర్ల ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేశారు.

అలాగే విజయ్ కుమార్ శుక్లా, సంజయ్ గోస్వామి, సందీప్ గార్గ్, వినోద్ కేడియాలతో సహా ఈ కంపెనీల వాటాదారులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణలో ఉన్నారు. వాషింగ్ మెషీన్‌లో దాచిన 2.54 కోట్ల రూపాయలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ (ఇడి) ఈ దాడిలో స్వాధీనం చేసుకుంది. అయితే వాషింగ్ మెషీన్‌లో ఉంచిన డబ్బును ఎక్కడ నుంచి స్వాధీనం చేసుకున్నారనే సమాచారాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం వెల్లడించలేదు. ఈ కంపెనీలు విదేశీ మారకద్రవ్య అక్రమాలకు పాల్పడ్డాయని, సింగపూర్‌కు చెందిన గెలాక్సీ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్, హారిజన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్‌కు రూ . 1,800 కోట్ల మేర డబ్బు పంపినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ వర్గాలు తెలిపాయి.

ఈ రెండు విదేశీ కంపెనీలను ఆంథోనీ డి సిల్వా అనే వ్యక్తి నిర్వహిస్తున్నారు. కాప్రికార్నియన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్, లక్ష్మీటన్ మారిటైమ్ మరియు వారి సహచరులు బోగస్ కార్గో సేవలు మరియు దిగుమతుల ముసుగులో సింగపూర్‌కు చెందిన కంపెనీలకు రూ.  1,800 కోట్లను మళ్లించారు. నేహా మెటల్స్‌, అమిత్‌ స్టీల్‌ ట్రేడర్స్‌, ట్రిపుల్‌ ఎమ్‌ మెటల్‌ అండ్‌ అల్లాయ్స్‌, హెచ్‌ఎంఎస్‌ మెటల్స్‌ వంటి బోగస్‌ కంపెనీల సాయంతో సంక్లిష్ట లావాదేవీల ద్వారా ఈ లావాదేవీలు జరిగాయి. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం మనీలాండరింగ్‌కు సంబంధించిన పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకుంది. సంబంధిత కంపెనీలకు చెందిన మొత్తం 47 బ్యాంకు ఖాతాలను కూడా సీజ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news