కోనసీమ జిల్లా ముమ్మడివరంలో జనసేనకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. కీలక నేతలంతా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.జనసేనలో కీలకంగా పని చేసిన పితాని బాలకృష్ణ,డీసీఎమ్ఎస్ మాజీ ఛైర్మన్ సానబోయిన మల్లికార్జున సహా పలువురు జనసేన నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతపురం జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు, ఆయన ఆశయాలు తమకు నచ్చాయని, అందుకే వైసీపీ లో చేరామని పితాని బాలకృష్ణ అన్నారు.
పిఠాపురంలో జనసేన కోసం తాము ఎనలేని కృషి చేసినప్పటికీ పవన్ సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపించారు. ముమ్మిడివరంలో వైసీపీ గెలుపునకు కృషి చేస్తామని పితాని బాలకృష్ణ తెలిపారు.కాగా పిఠాపురం నుంచి జనసేన తరపున పోటీ చేయాలని పితాని బాలకృష్ణ భావించగా, పవన్ కల్యాణ్ ఇతరులకు సీటు కేటాయించారు. దీంతో మనస్థాపం చెందిన ఆయన వైసీపీ పార్టీలో చేరారు.