శ్రీలంక, మాల్డీవుల పర్యటనకు వెళ్లనున్న విదేశాంగ మంత్రి జైశంకర్

-

భారత సన్నిహిత దేశాలు శ్రీలంక, మాల్డీవుల నాలుగు రోజుల పర్యటకు ఈరోజు బయలుదేరనున్నారు విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్. హిందూ మహాసముద్రంతో ద్వీపదేశాలుగా ఉన్న ఈ రెండు దేశాలు భారత్ కు ఎంతో కీలకం. భారత్ తో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడేలా ఈ పర్యటన సాగనుంది. మార్చి 26-27 రెండు రోజులు మాల్డీవుల్లో పర్యటించనున్నారు. 28 నుంచి మూడు రోజుల పాటు శ్రీలంకలో పర్యటించనున్నారు. మార్చి 29న కొలంబోలో జరిగే బిమ్ స్టెక్ మంత్రి వర్గ సమావేశంలో పాల్గొననున్నారు. 

విదేశాంగ శాక మంత్రి జైశంకర్ మాల్డీవుల్లో అడ్డూ నగరాన్ని సందర్శిస్తారు. ఆదేశ  అధ్యక్షుడు మెహమ్మద్ సోలిహ్ తో సమావేశం కానున్నారు. మాల్డీవుల్లో భారత్ చేపట్టిన ప్రాజెక్ట్ లతో పాటు సామాజిక, ఆర్థిక విషయాలపై చర్చించనున్నారు. పలు ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకం చేయనున్నాయి. మరోవైపు పీకల్లోతు ఆర్థిక, ఆహార సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న సమయంలో జైశంకర్ శ్రీలంక పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. శ్రీలంక ఆర్థిక, విదేశాంగ మంత్రులతో భేటీ కానున్నారు జైశంకర్.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version