అయోధ్య రామ మందిర భక్తులకు బిగ్ అలర్ఠ్. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం జరగనున్న వేళ ఆన్లైన్ లో నకిలీ ప్రసాదాల విక్రయాలు కలకలం రేపుతున్నాయి. ‘అయోధ్య ప్రసాదం’ పేరిట మిఠాయిలను అమ్ముతోందనే ఆరోపణలతో ఈ కామర్స్ దిగ్గజసంస్థ అమెజాన్ కు కేంద్రం నోటీసులు జారీ చేసింది.
రామ ప్రసాదం పేరిట నకిలీ ఉత్పత్తులను విక్రయిస్తూ ఆన్లైన్ కస్టమర్లను అమెజాన్ తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపిస్తూ కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. శ్రీరామ మందిర్ అయోధ్య ప్రసాద్, రఘుపతి నెయ్యి లడ్డు, కోయా కోబి లడ్డు, అయోధ్య రామ మందిర్ అయోధ్య ప్రసాద్, దేవి ఆవుపాలు…. ఇలా మరికొన్నింటిని అమ్ముతున్నట్లు అందులో పేర్కొంది. ఫిర్యాదుపై స్పందించిన సెంట్రల్ కన్ఫ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అమెజాన్ కు నోటీసులు జారీచేసింది. మరిదీనిపై అమెజాన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.