జూన్ 04 తరువాత అవినీతి పరులపై వేగంగా చర్యలు : ప్రధాని మోడీ

-

జూన్ 4 తర్వాత అవినీతిపరులపై చర్యలు ముమ్మరం చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 2014కు ముందు దేశంలో రోజుకో స్కామ్ జరిగేదని, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక స్కామ్లన్నీ ఆగిపోయాయని తెలిపారు. జార్ఖండ్లోని దుమ్కాలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా జేఎంఎం-కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్రంలో మోడీని తొలగించాలని ఈ రెండు పార్టీలూ కోరుకుంటున్నాయని తెలిపారు. ఎందుకంటే మోడీని తీసేస్తే మళ్లీ స్కామ్ లు చేసే అవకాశం దొరుకుతుందని వారు భావిస్తున్నారని విమర్శించారు. జేఎంఎం, కాంగ్రెస్లు జార్ఖండ్ న్ను అన్ని విధాలుగా లూటీ చేస్తున్నాయని ఆరోపించారు. మోసాలు జరగడానికి ఇక్కడి ప్రజలు అనుమతించబోరని తేల్చి చెప్పారు.

జేఎంఎం, కాంగ్రెస్ వ్యక్తుల నుంచి నోట్లకట్టలు పట్టుబడుతున్నాయి. ఈ డబ్బంతా మద్యం కుంభకోణం, కోట్ల రూపాయలు టెండర్ స్కామ్, మైనింగ్ స్కామ్ నుంచి వస్తోంది” అని వ్యాఖ్యానించారు. అంతేకాదు..  వారు సైన్యం భూమిని కూడా లాక్కున్నారని, ఇప్పుడు పేదలు, గిరిజనులు భూమి కబ్జాకు గురవుతోందని మండిపడ్డారు. ‘ఇండియా కూటమిలోని వ్యక్తులు ముస్లింలకు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని ఉవ్విళ్లూరుతున్నారు. కానీ మోడీ జీవించి ఉన్నంత కాలం పలితులు రిజర్వేషనను లాక్కోలేరు’ అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news