కన్న కూతురిపై తండ్రి అత్యాచారం, హత్య…!

-

బాలిక‌పై అత్యాచారం చేసి.. శ‌రీరాన్ని ముక్క‌లు ముక్క‌లుగా న‌రికిన తండ్రి ఓ తండ్రి ఎంత దారుణం చేశాడంటే మాట‌ల్లో చెప్ప‌డానికి చాలా క‌ష్టం. అస్స‌లు మ‌నిషిలా కాకుండా మృగంలా ప్ర‌వ‌ర్తించాడు. కంటికి రెప్ప‌లా కాపాడుకోవాల్సిన సొంత బిడ్డ‌పైనే అఘాయిత్యానికి ఒడిగ‌ట్టాడు. ఆమెపై అనేక‌సార్లు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. చివ‌ర‌కు బంధువు స‌హాయంతో కూతురి శ‌రీరాన్ని ముక్క‌లు ముక్క‌లుగా న‌రికేశాడు ఆ తండ్రి.

 

 

 

ఈ దారుణ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఖండ్వా జిల్లాలో మొన్న జ‌రిగింది, ఆల‌స్యంగా వెలుగు చూసింది. సాక్తాపూర్ గ్రామానికి చెందిన ఓ 14 ఏండ్ల అమ్మాయి త‌న తండ్రి (55)తో క‌లిసి ఉంటోంది. అయితే ఆ తండ్రి కూతురిపై క‌న్నేశాడు. బాలిక‌ను బెదిరింపుల‌కు గురిచేసి అత్యాచారానికి పాల్ప‌డుతున్నాడు.ఇటీవ‌ల ఆమె ప్ర‌తిఘ‌టించ‌డంతో క‌త్తితో న‌రికి చంపాడు. ఆ త‌ర్వాత శ‌రీరాన్ని ముక్క‌లు ముక్క‌లుగా చేశాడు.ఆ శ‌రీర భాగాల‌ను గోనె సంచుల్లో క‌ట్టేశాడు. బంధువు స‌హాయంతో బైక్‌పై ఆ గోనె సంచుల‌ను తీసుకెళ్లి.. స్థానికంగా ఉన్న న‌దిలో ప‌డేశాడు. ఈ దృశ్యాల‌ను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు చిత్రీక‌రించి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో అవిప్పుడు వైర‌ల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news