BREAKING: బెంగాల్‌ లో రైలు ప్రమాదం..5 గురు మృతి, 200 మందికి !

-

పశ్చిమ బెంగాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ రోజు(సోమవారం) ఉదయం డార్జిలింగ్ జిల్లాలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. అస్సాంలోని సిల్చార్ నుంచి కోల్‌కతాలోని సీల్దాకు కంచన్‌జుంఘా ఎక్స్‌ప్రెస్ వెళ్తుండగా రంగపాణి స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలును వెనుక నుంచి రైలు ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

Five people have died in the West Bengal train accident so far

దాదాపు 200 మంది ప్రయాణికులు ఈ సంఘటనలో గాయాలు అయినట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ రైలు ప్రమాదం జరిగిన వద్ద భయానక దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం…ఐదుగురు మృతి చెందారట. పలువురికి తీవ్రగాయాలు కాగా కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. దీనిపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news