ఏపీ పోలీసుల్లో వైసీపీ రక్తం ప్రవహిస్తోంది – హోం మంత్రి అనిత

-

ఏపీ పోలీసుల్లో వైసీపీ రక్తం ప్రవహిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు హోం మంత్రి అనిత. విశాఖలో హోం మంత్రి అనిత మాట్లాడుతూ…ఇప్పటికి కొంత మంది పోలీసు అధికారుల్లో వైసీపీ రక్తం ప్రవహిస్తున్నట్లుగా వ్యవహారిస్తున్నారని ఆగ్రహించారు.

anitha warns ap police

మీకు ఇంకా జగన్ మోహన్ రెడ్డి పై ప్రేమవుంటే, ఉద్యోగానికి రాజీనామాలు చేసి ఆ పార్టీ కోసం పని చేసుకోండంటూ చురకలు అంటించారు హోం మంత్రి అనిత.. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరు తప్పుచేసిన వొదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

మహిళలకు అన్యాయం జరగకుండా చూస్తాను…అవసరం మేరకు న్యాయ పోరాటం చేస్తామన్నారు. సింహాచలం దేవస్థానం భూములు ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కావడానికి వీలు లేదు…పంచగ్రామాల భూ సమస్యకు త్వరలో పరిష్కారం లభిస్తుందని వివరించారు హోం మంత్రి అనిత.

 

Read more RELATED
Recommended to you

Latest news