Flipkart, Amazon : సూపర్ ఆఫర్స్, వీటిపై దిమ్మతిరిగే డిస్కౌంట్స్?

-

అమెజాన్‌.. ప్రైమ్‌ డే సేల్‌ పేరుతో ఆఫర్స్‌ అందించనున్న విషయం తెలిసిందే. అయితే కేవలం ప్రైమ్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వస్తున్న ఈ సేల్ జులై 20,21వ తేదీల్లో అందుబాటులో ఉంది. అంటే ఈరోజు, రేపు అనమాట.ఈ సేల్‌లో పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్స్‌ లభించయనున్నాయి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులకు చెందిన డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్స్‌ లభిస్తోంది. అలాగే అమెజాన్‌ కొన్ని ఆఫర్లను కూడా అందిస్తోంది. ముఖ్యంగా పలు స్మార్ట్‌ ఫోన్‌లు తక్కువ ధరకే లభిస్తున్నాయి. ప్రైమ్‌ డే సేల్‌లో స్మార్ట్‌ ఫోన్స్‌పై లభిస్తోన్న బెస్ట్‌ డీల్స్‌ కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఐఫోన్‌ 13 ప్రస్తుత ధర రూ. 52 వేలు ఉండగా. సేల్‌లో రూ. 48,799కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్‌ ఆఫర్‌లో మరో వెయ్యి రూపాయాలు కూడా డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ని రూ. 47,799కి పొందొచ్చు. అలాగే వన్‌ప్లస్‌ నార్డ్‌4, శాంసంగ్‌ ఎం35, మోటోరొలా రేజర్‌ 50 అల్ట్రా, హానర్‌ 200 సిరీస్‌, లావా బ్లేజ్‌ ఎక్స్‌ 5జీ ఫోన్స్‌ తొలిసారి సేల్‌ ప్రారంభంకానున్నాయి.వన్‌ప్లస్‌ 12 ఫోన్‌ పై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ ఫోన్‌ అసలు ధర రూ.64,999 కాగా.. సేల్‌లో బ్యాంక్‌ ఆఫర్‌తో కలుపుకొని రూ.52,999కే సొంతం చేసుకోవచ్చు. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎస్‌23 అల్ట్రా ఫోన్‌ ధర రూ.74,999, ఐకూ నియో 9 ప్రో ధర రూ. 29,999కే సొంతం చేసుకోవచ్చు. వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ4 రూ.21,999, రెడ్‌మీ 13సి రూ.9499కే సొంతం చేసుకోవచ్చు.

అమెజాన్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్ కూడా సేల్‌ను నిర్వహిస్తోంది. గోట్‌ పేరుతో జూలై 19 నుంచి 23 దాకా ఐదురోజులపాటు సేల్ ప్రకటించింది.వస్తువుల కొనుగోళ్లపై 10 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అలాగే ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్ డిఎఫ్ సి బ్యాంకులు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ అందిస్తుంది. ఇక వీటితో పాటు కొన్ని రకాల స్మార్ట్‌ ఫోన్‌లపై ఫ్లిప్‌కార్ట్ కళ్లు చెదిరే ఆఫర్లను అందిస్తోంది. ఇందులో భాగంగా స్మార్ట్‌ ఫోన్స్‌పై లభిస్తోన్న కొన్ని బెస్ట్‌ ఆఫర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..నథింగ్ ఫోన్‌2పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్‌ అసలు ధర రూ. 33,999 కాగా, సేల్ భాగంగా కేవలం రూ.28,999కే సొంతం చేసుకోవచ్చు. అలాగే పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్‌ కూడా పొందొచ్చు. దీంతో ఈ స్మార్ట్ ఫోన్‌ను రూ. 19,999కే సొంతం చేసుకోవచ్చు.

అలాగే ఐఫోన్‌ 14 ప్లస్‌పై కూడా భారీ డిస్కౌంట్ ఉంది. దీని అసలు ధర రూ.55,999కాగా బ్యాంకు ఆఫర్లతో పాటు, ఎక్స్చేంజ్ ఆఫర్లతో కలిపి ఈ సేల్‌లో భాగంగా రూ. 53,999కి దీన్ని సొంతం చేసుకోవచ్చు.గూగుల్ పిక్సెల్‌ 8 అసలు ధర రూ. 61,999 రూపాయలు కాగా ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ లో కేవలం రూ. 47,999కే లభిస్తోంది. పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 4000 డిస్కౌంట్ ని పొదొచ్చు. గూగుల్ పిక్సెల్ 7 ప్రో మోడల్ మార్కెట్ ధర 55,999 రూపాయలు కాగా 50,999 రూపాయలకు లభించనుంది.ఇక మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో అసలు ధర రూ. 29,999 కాగా, సేల్‌లో భాగంగా రూ. 28000కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్‌ ఆర్లలో భాగంగా దీనికి రూ 2 వేల డిస్కౌంట్‌ లభిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news