నగరాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాము : సీఎం రేవంత్ రెడ్డి

-

విశ్వనగరంగా హైదరాబాద్ ను తీర్చడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని , ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

ఇవాళ గోపన్ పల్లి ఫ్లై ఓవర్ ను సీఎం ప్రారంభించారు. జెండా ఊపి ఫ్లై ఓవర్ పైకి ఉమెన్ బైకర్ ను అనుమతించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మూసీ రివర్ డెవలప్మెంట్ కు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. మూసీ అంటే ముక్కు మూసుకొనే పరిస్థితి ఉందని, వచ్చే 5 సంవత్సరాలలో ప్రపంచ స్థాయి పర్యాటకులు వచ్చి దర్శించుకునేలా చేస్తామని అన్నారు. ఇందుకోసం మూసీ అభివృద్ధి బాధ్యతను తానే తీసుకున్నానని వెల్లడించారు.వచ్చే 5 సంవత్సరాలలో 1.50 లక్షల కోట్లు ఖర్చు చేసి మూసీ నదిని లండన్ లోని థేమ్స్ రివర్ లా అభివృద్ది చేయబోతున్నామని అన్నారు. మూసీ అభివృద్ధిని చూడగానే ప్రజాప్రభుత్వం గుర్తుకు వచ్చేలా అభివృద్ది చేస్తామని ఆయన అన్నారు. హైదరాబాద్ అభివృద్దిలో అందరూ భాగస్వాములు కావాలని సీఎం కోరారు.తెలంగాణకు వచ్చే ఆదాయంలో 65 శాతం జంటనగరాలదేనని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news