ఎస్.బి.ఐ కస్టమర్లకు గుడ్ న్యూస్..!

-

దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా తమ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. కస్టమర్ల సౌలభ్యం కోసం కొత్త సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించే వారి కోసం ఈ సర్వీసులను తీసుకువచ్చింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనల మేరకు ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించే వారికి కోసం కొత్త సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఎస్‌బీఐ కార్డ్ మొబైల్ యాప్ వాడే వారు వెంటనే ఈ సర్వీసులు పొందొచ్చు.

ఎస్‌బీఐ ఒక నోటిఫికేషన్ ద్వారా ఈ కొత్త సర్వీసుల గురించి కస్టమర్లకు తెలియజేసింది. దీంతో క్రెడిట్ కార్డు ఉపయోగించే వారికి ప్రయోజనం కలుగనుంది. ఎస్‌బీఐ కార్డ్ తీసుకువచ్చిన కొత్త సర్వీసుల్లో భాగంగా క్రెడిట్ కార్డు ఉపయోగించే వారు వారి లావాదేవీలపై లిమిట్‌ను ఏర్పాటు చేసుకునేలా వెసులుబాటు కల్పించింది. టోకనైజ్డ్ ట్రాన్సాక్షన్లపై కూడా లిమిట్‌ పెట్టుకునే అవకాశం ఉంది. పిన్ బేస్ట్ లావాదేవీలకు, నాన్ పిన్ బేస్డ్ లావాదేవీలకు ప్రత్యేకమైన లిమిట్ ఉండేలా వెసులుబాటు కల్పించింది.

అలాగే డొమెస్టిక్ ట్రాన్సాక్షన్లలో భాగంగా ఆన్‌లైన్ ట్రాన్సాక్సన్లు, పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) ట్రాన్సాక్షన్లు, కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్లు, ఏటీఎం ట్రాన్సాక్షన్ల సర్వీసులను యాక్టివేట్ చేసుకోవాలా? లేదా? అనేదానిపై కూడా ఖాతాదారుల నిర్ణయానికే వదిలేసింది. వీటిని ఆన్‌ లేదా ఆఫ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇకపోతే ఇంటర్నేషల్ ట్రాన్సాక్షన్లలో మాత్రం అన్ని సర్వీసులు డిఫాల్ట్‌గానే ఆఫ్‌లోనే ఉంటాయి.

ఖాతాదారులు అవసరం అనుకుంటే అంతర్జాతీయ ట్రాన్సాక్షన్లలో మళ్లీ ఏటీఎం, పీవోఎస్, కాంటాక్ట్‌లెస్, ఆన్‌లైన్ వంటి సర్వీసులను యాక్టివేట్ చేసుకోవచ్చు. అంతేకాదు టోకనైజ్డ్ ట్రాన్సాక్షన్లకు కూడా పరిమితులు విధించుకోవచ్చు. పిన్ లేకుండా రూ.2,000 వరకు లావాదేవీలను నిర్వహించొచ్చు. రోజుకు ఎన్ని లావాదేవీలు నిర్వహించాలో కూడా సెట్ చేసుకునే వెసులుబాటు కొత్త సర్వీసుల ద్వారా అందుబాటులోకి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news