BIG BREAKING : పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూత

పాకిస్థాన్‌ దేశానికి మరో బిగ్‌ షాక్‌ తగిలింది. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌ కు విషాదం రూపంలో షాక్‌ తగిలింది. పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశాడు. దుబాయ్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్.

గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దుబాయ్ లోని అమెరికన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుది శ్వాస విడిచారు. 1999 నుంచి 2008 వరకు ముషారఫ్ పాక్ అధ్యక్షుడిగా పనిచేశారు.