జమ్మూలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ తరుణంలో ఉగ్రవాది హతం అయ్యాడు. దాడులు, ప్రతిదాడులతో జమ్మూకాశ్మీర్ దద్దరిల్లుతోంది. ప్రస్తుతం షోపియాన్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాదిని భారత బలగాలు మట్టుబెట్టాయి.

ఇదే ప్రాంతంలో మరో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రత బలగాలు భావిస్తున్నాయి. కాగా, కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ తుంగలో తొక్కి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. కాగా ఎయిర్ ఇండియా ఎక్సప్రెస్ విమానంకు బాంబు బెదిరింపులు వచ్చాయి. కొలకత్తా నుంచి హైదరాబాద్ వచ్చింది ఎయిర్ ఇండియా ఎక్సప్రెస్ విమానం. ఈ విమానంలోని బాత్రూంలో బాంబు పేల్చి వేస్తామంటూ రాశారు అగంతకులు. విమానంలో బాంబు బెదిరింపు వ్యవహారాన్ని వెంటనే ఏటీసీకి తెలిపారు పైలట్. అనంతరం ఎయిర్ ఇండియా ఎక్సప్రెస్ విమానం హైదరాబాద్ కు చేరుకుంది. నాలుగు గంటలపాటు తనిఖీ చేసి బాంబు లేదని తేల్చారు అధికారులు.