‘ముందు రాయ్‌బరేలీ నుంచి గెలవండి’.. రాహుల్ గాంధీపై గ్యారీ కాస్ప‌రోవ్ కామెంట్‌

-

లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్ తో పాటు రాయ్ బరేలి  నుంచి కూడా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రాయ్ బరేలి నుంచి రాహుల్ బరిలో నిలవడంపై ఇప్పటికే బీజేపీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఓటమి భయంతోనే అమేఠి నుంచి కాకుండా రాయ్ బరేలి నుంచి పోటీ చేస్తున్నారని విమర్శించింది. అయితే తాజాగా రాహుల్ గాంధీపై మాజీ వరల్డ్ చెస్ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్ కూడా విమర్శలు చేశారు.
రాజ‌కీయాలు, చెస్ అంటే త‌న‌కు ఇష్ట‌మ‌ని ఇటీవ‌ల రాహుల్ గాంధీ వ్యాఖ్య‌లు చేశారు. ఆ కామెంట్‌కు చెందిన పోస్టు ఒక‌టి వైర‌ల్ . గ్యారీ కాస్ప‌రోవ్ త‌న ఫెవ‌రేట్ చెస్ క్రీడాకారుడు అని కూడా రాహుల్ వ్యాఖ్యానించారు. అయితే ఆ కామెంట్‌పై క్యాస్ప‌రోవ్  స్పందిస్తూ.. టాప్ ప్లేస్‌లో పోటీప‌డాలంటే ముందుగా రాయ్‌బ‌రేలీలో నెగ్గాలంటూ కామెంట్స్ చేశారు.అయితే ఆ కామెంట్ చేసిన కొన్ని గంట‌ల్లోనే మ‌ళ్లీ క్యాస్ప‌రోవ్ మ‌రో వ్యాఖ్య చేశారు. త‌న వ్యాఖ్య‌ల‌ను జోక్‌గా తీసుకోవాల‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news