జులైలో మరో 4 వందే భారత్‌ రైళ్లు ప్రారంభం.. రూట్లు ఇవే

-

వందే భారత్ రైలు భారత్​లో పలు ప్రాంతాల్లో పరుగు పెడుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 25 రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే తాజాగా మరో 4 వందే భారత్ రైళ్లను తీసుకొచ్చేందుకు రైల్వే శఆఖ సన్నాహాలు చేస్తోంది. జులై నెలాఖరులోనే వీటిని ప్రారంభించాలని చూస్తోంది. ఈ నాలుగు రైళ్లూ ఎనిమిదేసి కోచ్‌లతో నడవనున్నాయి. ఇందులో ఏడు ఛైర్‌ కార్లు, ఒక ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ కోచ్‌లు ఉండనున్నాయి.

ఈ నెలలో ప్రారంభించనున్న రూట్లలో దిల్లీ- చండీగఢ్‌, చెన్నై- తిరునల్వేలి, లఖ్‌నవూ- ప్రయాగ్‌రాజ్‌, గ్వాలియర్‌- భోపాల్‌ ఉండనున్నాయి. ఎనిమిదేసి కోచ్‌లలో 556 మంది ప్రయాణించడానికి వీలుంటుంది. ప్రస్తుతం 25 రైళ్లు నడుస్తుండగా.. అందులో తొమ్మిది రైళ్లు ఎనిమిదేసి కోచ్‌లతోనే నడుస్తున్నాయి. కొత్త రైళ్లు కలిపితే మొత్తం వందే భారత్‌ రైళ్ల సంఖ్య 29కి చేరనుంది.

దిల్లీ- చండీగఢ్‌ రూట్‌లో ఇప్పటికే శతాబ్ది సహా పలు రైళ్లు నడుస్తున్నాయి. అయినప్పటికీ ఈ రూట్‌లో ప్రయాణికుల నుంచి విపరీతమైన డిమాండ్‌ ఉంది. దీంతో వందే భారత్‌ రైలును తీసుకురావాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Latest news