ఒక కేసులో సాక్ష్యాలు చాలా క్లిష్టంగా ఉంటే ఎక్కువగా కుక్కల సహాయం తీసుకుంటారు పోలీసులు. కుక్కలు వాసన పసిగట్టి కేసుల విషయంలో తమ వంతుగా విచారణ వేగవంతం చేస్తాయి. అలాంటి కుక్క ఇప్పుడు ఒకటి మరణించింది. మహారాష్ట్రలో 365 కేసుల విచారణలో చాలా కీలకంగా వ్యవహరించిన ఒక శునకం గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడుతుంది.
మహారాష్ట్రలోని బీడ్ లో… ఆ కుక్క పేలుడు పదార్ధాలను గుర్తించడం, హత్యా నేరస్తులను పట్టుకోవడం లో పోలీసులకు తన వంతుగా సహాయం అందించింది. దాని పేరు రాఖీ. అది ఇటీవల మరణించడంతో కరోనా ఉన్నా సరే అధికారులు ఘనంగా దానికి నివాళులు అర్పించి అంత్యక్రియలను పోలీసు లాంచనాలతో నిర్వహించారు. ఉన్నతాధికారులకు కూడా ఆ కుక్క ఎంతో సన్నిహితం.