పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య ఇటీవల యుద్ధం జరిగిన నేపథ్యంలో… సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా 2008 ఒలంపిక్స్ ప్రారంభ వేడుకల సమయంలో జరిగిన సంఘటన తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ.. ఒలంపిక్స్ 2008 వేడుకలలో పాల్గొన్నారు. ఇక అదే సమయంలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేత బిహావల్ భుట్టో అలాగే ఆయన సోదరీమణులు భక్తావర్, అసిఫా కూడా అక్కడే మెరిశారు.

వీళ్లంతా… చైనా కమ్యూనిస్టు పార్టీ ఆహ్వానం మేరకు బీజింగ్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఈ రెండు రాజకీయ కుటుంబాలు సుమారు 30 నిమిషాల పాటు ఒక ప్రవేట్ సమావేశం లో పాల్గొన్నట్లు అప్పట్లోనే వార్తలు వచ్చాయి.. ఈ సందర్భంగా సోనియాగాంధీ అలాగే బెనజీర్ భుట్టో హత్య విషయంపై భుట్ట కుటుంబానికి సానుభూతి తెలిపినట్లు ఇప్పటికీ ప్రచారం జరుగుతుంది. ఈ సందర్భంగా రాజకీయ అలాగే విదేశీ, రహస్య వ్యూహాలపై చర్చలు కూడా జరిపారని సమాచారం.
ఈ మేరకు ఎం ఓ యు కూడా కుదిరినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటికీ ఈ విషయాలు బయటపెట్టలేదు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన ఒక ఫోటో 17 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చింది. దీనిపై ఇప్పుడు రాజకీయంగా… కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ ఫోటో వైరల్ కావడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరూ కూడా స్పందించడం లేదు. చైనా అలాగే పాకిస్తాన్ తో ఇలాంటి సంబంధాలు ఏంటి అని బిజెపి నేతలు ప్రశ్నిస్తుంటే… సైలెంట్ అయిపోతున్నారు కాంగ్రెస్ నేతలు.