BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఊహించని షాక్ తగిలింది. కేటీఆర్ కు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరోసారి నోటీసులు జారీ చేసింది ఏసీబీ. ఈ-ఫార్ములా కేసులో ఈ నెల 28న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది ఏసీబీ.

ఇక కేటీఆర్ కు మరోసారి నోటీసులు జారీ కావడం పై కవిత స్పందించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం KTR గారికి నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టమవుతోంది. మా పార్టీ నాయకులకు వరుస నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు తేటతెల్లమైందని చురకలు అంటించారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ గారి సైనికులది అని పేర్కొన్నారు.