రోహిత్ శర్మ కెప్టెన్ కాదు..గ్రేట్ లీడర్ అని మాజీ క్రికెటర్ గంభీర్ ప్రశంసలు కురిపించారు. రోహిత్ శర్మ కెప్టెన్సీపై గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించారు. ‘ఇండియాకు చాలామంది కెప్టెన్లు వచ్చారు. కానీ రోహిత్ శర్మ లీడర్. లీడర్ కు, కెప్టెన్ కు చాలా తేడా ఉంది. రోహిత్ నిస్వార్ధంగా జట్టు కోసం ఆడుతున్నాడు. కెప్టెన్సీ పరంగా, ఆటపరంగా జట్టును ముందుండి నడుపుతున్నాడు. రోహిత్ సెంచరీల వెనుక, రన్స్ వెనుక పరిగెత్తడు.
లేదంటే ఇప్పటికే 40-45 సెంచరీలు ఉండేవి’ అని గంభీర్ తెలిపారు. కాగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో భాగంగా…నిన్న జరిగిన మ్యాచ్ లో టీమిండియా జయ కేతనం ఎగురవేసింది. ఇంగ్లాండ్ తో ఆదివారం జరిగిన లోస్కోరింగ్ గేమ్ లో టీమిండియా 100 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్ లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న టీమిండియా సెమిస్ బెర్త్ ను ఖరారు చేసుకుంది.బ్యాటింగ్ లో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ సత్తా చాట గా… బౌలింగ్ లో మహమ్మద్ షమీ, జస్ట్ప్రిత్ బూమ్రా, కుల్దీప్ యాదవ్ నిప్పులు చెరిగారు.