చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మెన్ గా జ‌న‌ర‌ల్ ఎంఎం న‌ర‌వణె

చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ క‌మిటీ చైర్మెన్ గా ప్ర‌స్తుతం ఆర్మీ చీఫ్ గా ఉన్న ఎంఎం న‌ర‌వణె బాధ్య‌త‌లు చేప‌ట్టారు. సీడీఎస్ బిపిన్ రావ‌త్ మ‌ర‌ణం తో ఈ స్థానం ఏర్ప‌డ్డ‌ది. ఇక నుంచి ఎంఎం న‌ర‌వ‌ణె త్రివిధ ద‌ళాల చీఫ్ క‌మిటీల‌కు చైర్మెన్ గా వ్య‌వ‌హ‌రిస్తాడు. నిజానికి సీఎడీఎస్ గా బిపిన్ రావ‌త్ ఉన్న స‌మ‌యంలో త్రివిధ ద‌ళాల‌కు అధిప‌తి గా ఉండే వాడు. కానీ ఆయ‌న మ‌ర‌ణం తర్వాత చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ క‌మిటీ చైర్మెన్ గా ఎంఎం న‌ర‌వ‌ణె ను నియ‌మిస్తూ అధికారులు నిర్ణ‌యం తీసుకున్నారు.

అయితే ఇప్పుడు ఉన్న మూడు విభాగాల్లో సీనియ‌ర్ గా ఉన్న ఎంఎం న‌ర‌వ‌ణె నే చైర్మెన్ గా ఎన్నుకున్నారు. ఈ క‌మిటీ లో ఆర్మీ, వాయు సేన‌, నావికా ద‌ళాల చీఫ్ లు స‌భ్యులు గా ఉంటారు. త్రివిధ ద‌ళాల విష‌యం లో చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ క‌మిటీ చైర్మెన్ నిర్ణ‌యం తీసుకునే అధికారం ఉంటుంది. ఇదీలా ఉండ‌గా.. సీడీఎస్ ప‌ద‌వి సృష్టించ‌క ముందు త్రివిధ ద‌ళాల‌కు చీఫ్ గా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ల‌లో సీనియ‌ర్ గా ఉన్న చీఫ్ నే చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ క‌మిటీ చైర్మెన్ గా ఎన్నుకునే వారు. కానీ సీడీఎస్ బిపిన్ రావ‌త్ చ‌నిపోయిన త‌ర్వాత మ‌ళ్లీ పాత ప‌ద్ద‌తినే తీసుకు వ‌చ్చారు.