LIGER : “లైగర్” మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్… ఇక దేవరకొండ ఫాన్స్ కు జాతరే

-

హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకోగా.. ప్రస్తుతం ప్రమోషన్‌ పనిలో పడింది చిత్ర బృందం. ఇక ఈ సినిమాలో విజయ్‌ దేవర కొండ కు జోడిగా అనన్య పాండే నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు.

అయితే ఈ లైగర్ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా అనౌన్స్ చేసింది చిత్రబృందం. వచ్చే ఏడాది ఆగస్టు 25వ తేదీన లైగర్ సినిమాను థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు అధికారికంగా చిత్రబృందం ప్రకటించింది. అలాగే డిసెంబర్ 31, 2021 కి ఈ సినిమా నుంచి గ్లింప్స్ ను కూడా విడుదల చేస్తున్నట్లు టైగర్ టీం పేర్కొంది. ఈ మేరకు అధికారికంగా ఓ పోస్టర్ కూడా విడుదల చేసింది చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Latest news