పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన భూమా అఖిలప్రియ

భూమా ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. టిడిపి నేత మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త భార్గవ్ రామ్ స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. భూమా అఖిలప్రియ తన బిడ్డతో ఉన్న ఫోటోలు షేర్ చేసి.. మగ బిడ్డ పుట్టింది అంటూ ఆయన పేర్కొన్నారు. తల్లి శోభానాగిరెడ్డి జయంతి రోజునే అఖిలప్రియ కుమారుడికి జన్మనివ్వడం విశేషం. భూమా నాగిరెడ్డి మళ్లీ ఇలా పుట్టారంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

కాగా భూమా అఖిల ప్రియ మంత్రిగా ఉన్న సమయంలో భార్గవ రామ్ ను వివాహం చేసుకున్నారు. ఆతర్వాత భూమా ఫ్యామిలీ చుట్టూ ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. హైదరాబాద్ లోని భూవివాదంలో ఓ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన కేసులో అఖిలప్రియ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు అఖిల ప్రియ భర్త అజ్ఞాతంలోకి వెళ్లారు. అలాగే కర్నూలు జిల్లాలో కూడా ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసినట్లు కేసు నమోదయింది. ఎన్ని వివాదాలు చుట్టుముట్టిన భూమి కుటుంబం నియోజకవర్గంలో చాలా యాక్టివ్ గా ఉంది.

https://www.facebook.com/Bhargavaramnaiduofficial/