IPL 2023 : గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుబ్ మన్ గిల్ తాజాగా మరో రికార్డును సృష్టించారు. IPL చరిత్రలో ఒక సీజన్ లో 700కు పైగా రన్స్ చేసిన రెండో భారత క్రికెటర్ గా నిలిచారు. గిల్ ఈ సీజన్ లో ఇప్పటివరకు 705 పరుగులు చేశారు. గతంలో RCB ప్లేయర్ విరాట్ కోహ్లీ ఒకే సీజన్ (2016) లో 973 పరుగులు చేసి, ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ క్రికెటర్ గా రికార్డు సృష్టించారు.
ఇక ఇదే మ్యాచ్ లో చెన్నై ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మరో ఘనత సాధించారు. ఐపీఎల్ చరిత్రలో 1000కి పైగా పరుగులు చేసి, 150కి పైగా వికెట్లు పడగొట్టిన ఆటగాళ్ల జాబితాలోకి చేరారు. ఈ లిస్టులో డ్వెన్ బ్రావో (1560 పరుగులు, 183 వికెట్లు), సునీల్ నరైన్ (1046 పరుగులు, 183 వికెట్లు), రవీంద్ర జడేజా (2677 పరుగులు, 150 వికెట్లు) మాత్రమే ఉన్నారు.