దారుణం.. ఆ ఫొటోలు చూపించి బాలికపై ఏడుగురి గ్యాంగ్ రేప్

-

ఓ బాలికపై ఏడుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని నాగ్​పుర్​ జిల్లాలో చోటుచేసుకుంది. బాలిక తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆ బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రధాన నిందితుడిని ధీరజ్ హివార్కర్​గా పోలీసులు గుర్తించారు.

బాలికను వెంబడించిన ధీరజ్ .. తనతో శారీరక సంబంధం పెట్టుకోకపోతే ఆమె తండ్రిని చంపేస్తానని బెదిరించాడు. ఆ బెదిరింపులకు భయపడిన ఆ బాలిక అతడికి లొంగిపోయింది. అలా ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డ ఆ కీచకుడు ఆ సమయంలో ఫొటోలు తీశాడు. కొన్నిరోజుల తర్వాత ఆ అసభ్యకరమైన ఫొటోలను చూపించి వైరల్ చేస్తానని బెదిరించి మళ్లీ అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా వాటిని తన స్నేహితులకు పంపాడు.

వాళ్లు కూడా ఆ ఫొటోలను చూపించి బెదిరిస్తూ బాలికపై వేర్వేరుగా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక ఇటీవల ఏకంగా అందరూ కలిసి బాలికపై అమానుషంగా సామూహిక అత్యాచారం చేశారు. ఈ విషయం బాలిక తన తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news