ఆసియా గేమ్స్‌లో భారత్ పతకాల వేట.. షూటింగ్‌లో మరో గోల్డ్‌.. వుషూలో రజతం

-

ఆసియా గేమ్స్‌లో భారత్ పతకాల వేట విజయవంతంగా కొనసాగుతోంది. ఐదో రోజూ ఆరంభంలోనే ఇండియా పసిడి, రజత పతకాలను తన ఖాతాలో వేసుకుంది సొంతం చేసుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ టీమ్‌లో ఇండియన్ షూటర్లు సరబ్‌జోత్‌ సింగ్, అర్జున్ సింగ్ చీమా, శివ నర్వాల్ బృందం గోల్డ్ మెడల్ సాధించారు. దీంతో ఇప్పటి వరకు షూటింగ్‌లో భారత్ ఆరు గోల్డ్ మెడల్స్​ సాధించినట్టైంది. వ్యక్తిగత విభాగంలోనూ సరబ్‌జోత్, అర్జున్‌ సింగ్‌ పతకాల వేటకు అర్హత సాధించారు.

మరోవైపు ఇవాళ తొలి పతకం అందించిన ఘనత మాత్రం రోషిబినా దేవిదే. వుషూ 60 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరిన రోషిబినా రజత పతకం సాధించింది. 2018 ఆసియా క్రీడల్లో ఆమె కాంస్య పతకం గెలుచుకుంది. ఇప్పుడు అత్యుత్తమ ప్రదర్శన చేసి రజతకం గెలుచుకుంది. మరోవైపు టేబుల్ టెన్నిస్‌లో మాత్రం ఇండియాకు మెడల్ దక్కలేదు. భారత జోడీ ఓటమి పాలైంది. ప్రస్తుతం భారత్ మొత్తం 24 పతకాలతో పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. ఇందులో ఆరు గోల్డ్‌, 8 రజతాలు, 10 కాంస్య పతకాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news