ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జలంధర్ నివాసి అయిన హర్భజన్ సింగ్ గతం లో బీజేపిలో చేరతారు అంటూ వార్తలు వినిపించాయి.పంజాబ్ ఎన్నికల్లో కూడా ఆయన్ను సీఎం చేసేందుకు సన్నాహాలు చేశారు.అయితే పంజాబ్లో పరిస్థితిని చూసి బీజేపీ వెనక్కి తగ్గింది.ఆ తరువాత పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ బజ్జీని కలిశారు.దీంతో బజ్జీ కాంగ్రెస్ లో చేరతారని అంతా ఊహించారు.అయితే ఆయన ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇష్టపడలేదు.
దాని తరువాత అకస్మాత్తుగా అతను ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాడు.ఆప్ అతడిని పంజాబ్ నుంచి రాజ్యసభకు పంపించింది.అయితే హర్భజన్ ఓ కీలక నిర్ణయాన్ని తీసుకున్నాడు.రాజ్యసభ నుంచి వచ్చే జీవితాన్ని రైతు పిల్లల చదువులు, వారి సంక్షేమం కోసం ఖర్చు చేస్తా అంటూ ప్రకటించాడు.దేశాభివృద్ధి కోసం తాను చేయగలిగింది అంతా తప్పకుండా చేస్తానని బజ్జీ పేర్కొన్నాడు.అయితే రైతులకు బహిరంగంగా మద్దతు ఇవ్వని బజ్జీ..రైతు ఉద్యమంలో పాత్ర పై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.