బడ్జెట్‌ ప్రభావంతో భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే?

-

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2024-25లో బంగారం, వెండి, మొబైల్ ఫోన్లు, క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్స్ సుంకాలు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వీటి ధరలు తగ్గనున్నాయి. దేశంలోని బంగారు వ్యాపారులు చాలా కాలంగా చేస్తున్న డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చినట్లు అయ్యింది. ఈ నేపథ్యంలో బడ్జెట్ ప్రకటనతో మార్కెట్లో బంగారం ధర ఏకంగా నాలుగు వేల రూపాయలు తగ్గింది.

సాధారణంగా వివాహాలు, ఇతర శుభకార్యాలు అంటే అందరికి మొదట గుర్తువచ్చేది బంగారం. అలాంటి శుభకార్యలు ఎక్కువగా శ్రావణమాసంలో జరుగుతుంటాయి. శ్రావణమాసానికి ముందే బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఇటు మహిళలు, అటు వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్లో బంగారం, వెండిపై కేంద్రం 6 శాతానికి పన్ను తగ్గించడంతో పసిడి ధర 10 గ్రాములకు అమాంతం 4000 తగ్గిపోయింది. ప్రస్తుతం తులం బంగారం ధర రూ.71 వేలు పలుకుతోంది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వానికి చేస్తున్న డిమాండ్ ఇప్పుడు నెరవేరిందని.. నగల వ్యాపారులు అంటున్నారు. బంగారంపై పన్ను శాతం తగ్గించి కేంద్రం మంచి నిర్ణయం తీసుకుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. వచ్చేది పెళ్లి సీజన్ కావడంతో అమ్మకాలు పెరుగుతాయని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news