మళ్ళీ పెరిగిన పసిడి ధర.. భారీగా పడిపోయిన వెండి ధర !

-

గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు ఈ రోజు మాత్రం గట్టిగానే పెరిగాయి. పండుగ సీజన్ కావడంతో ఈ బంగారం రేటు పెరుగుతోందని భావిస్తున్నారు. ఇప్పటికే బంగారం ధర పెరుగుతూ రావడం ఇది వరుసగా మూడో రోజు. హైదరాబాద్‌ సహా విశాఖ పట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర ఏకంగా 430 రూపాయల మేర పెరిగింది.

దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 52,360కి పెరిగింది. అయితే 22 క్యారెట్ల బంగారం ధర 390 దాకా పెరగడంతో 10 గ్రాముల ధర 48,000కి పెరిగింది. ఇక మొన్న బాగా తగ్గిన వెండి ధరలు నిన్న మాత్రం బాగా పెరిగాయి. నిన్న మార్కెట్‌లో వెండి ధర రూ.1,300 మేర పెరిగడం 1 కేజీ వెండి ధర రూ.66,500కు చేరుకుంది. అయితే ఈరోజు మళ్ళీ వెండి ధరలు భారీగా తగ్గాయి. కేజీ వెండి ధర ఏకంగా రూ.2,100 పడిపోవడంతో వెండి ధర రూ.64,500కు దిగొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news