జగన్ ప్లానింగ్ బాగుంది.. టెన్షన్ పెట్టొద్దు మీడియా!

-

ఏపీ పాఠశాలలు ఓపెన్ చేశారని ఒక వర్గం మీడియా చేస్తున్న రాద్ధాంతం మాములుది కాదు! వారి బాదంతా స్కూల్స్ ఓపెన్ చేశారనా.. స్కూల్స్ ఓపెన్ చేసినందుకైనా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనా అన్నది వారికే తెలియాలి! అయితే… జగన్ సర్కార్ గుడ్డిగా స్కూల్స్ ఓపెన్ చేసిందా?


ఒక విద్యార్థి జీవితంలో ఒక ఏడాది పోయిందంటే అది చిన్న విషయం కాదు. కరోనా అనే ఒక వైరస్ కారణంగా.. జీవితంలో ఒక ఏడాదిని వృథాచేసుకోకూడదు అన్న ఆలోచనే కారణం అయ్యి ఉండొచ్చు! ఈ పరిస్థితుల్లో ఎక్కడికక్కడ జిల్లా కలెక్టర్లు పాఠశాలలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ… కొత్తగా కరోనా కేసులు వచ్చినచోట కొన్ని రోజుల పాటు సెలవులు ఇవ్వడం.. వారందరికీ ఆన్ లైన్ క్లాసులు అందేలా చూడటం చేస్తున్నారు!

ఇదే క్రమంలో… ప్రతి స్కూల్ లో పిల్లలకు శానిటైజేషన్ అలవాటు చేస్తున్నారు. 150 పని దినాలతో ఈ ఏడాది సిలబస్ పూర్తి చేసి, తక్కువ సిలబస్ పైనే పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఇది కచ్చితంగా మంచి ఆలోచనే! ఈ విషయంలో తల్ల్లితండ్రుల్లో అపోహలు కలిగించడం, వారిని టెన్షన్స్ పెట్టడం సహేతుకమైన చర్యా కాదా అన్నది ఆ మీడియా ఆలోచించుకోవాలనేది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది!

Read more RELATED
Recommended to you

Latest news