యాపిల్ యూజర్లకు గుడ్ న్యూస్…!

ప్రముఖ మొబైల్ తయారి దిగ్గజం యాపిల్ పండుగ సీజన్ ముందు సెప్టెంబర్ 23 న భారతదేశంలో ఆ తన మొట్టమొదటి ప్రత్యేకమైన ఆన్‌లైన్ స్టోర్ ని ప్రారంభించటానికి సిద్ధంగా ఉంది. దేశవ్యాప్తంగా వినియోగదారులకు పూర్తి స్థాయి ఉత్పత్తులు, సపోర్ట్ మరియు ప్రీమియం అనుభవాన్ని ఇది అందిస్తుందని యాపిల్ పేర్కొంది. లాజిస్టిక్స్ మద్దతు కోసం, ఆపిల్ బ్లూ డార్ట్ తో భాగస్వామ్యమై౦ది.

ప్రస్తుత మహమ్మారి పరిస్థితుల దృష్ట్యా, వినియోగదారుల కోసం ఈ వారం ప్రారంభంలో ప్రారంభించిన వాటితో సహా ( ఆపిల్ వాచ్ సిరీస్ 6 మరియు కొత్త ఐప్యాడ్ ఎయిర్) అన్ని ప్రీమియం మరియు కొత్త ఉత్పత్తులను కొనుగోలు చేసిన తేదీ నుండి 24-72 గంటల్లో సురక్షితమైన, కాంటాక్ట్‌ లెస్ డెలివరీలను అందిస్తారు. “ఆపిల్ స్టోర్ ఆన్‌లైన్‌ను భారతదేశానికి తీసుకురావడానికి మేము చాలా సంతోషిస్తున్నామని పేర్కొంది.