భారతీయ వైద్య విద్యార్థులకు శుభవార్త.. ఇకపై విదేశాల్లో కూడా ప్రాక్టీస్..!

-

భారతీయు వైద్య విద్యార్థులు ఇకపై విదేశాల్లో కూడా ప్రాక్టీస్ చేయవచ్చని కేంద్ర, వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యూకేషన్ నుంచి జాతీయ వైద్య మండలి వచ్చే పదేళ్ల కాలానికి గుర్తింపు లభించినట్టు అయింది. దీంతో భారత్ లో వైద్య విద్య అభ్యసించిన వారు అమెరికా, కెనడా ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్ లో పీజీ కోర్సులో చేరడంతో పాటు ప్రాక్టీస్ చేయవచ్చని తెలిపింది.

2024 నుంచి భారతీయ వైద్య విద్యార్థులు విదేశాలలో విద్య ప్రాక్టీస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో ఉన్న, రాబోయే పదేళ్లలో ఏర్పాటు అయ్యే వైద్య కళాశాలలు డబ్ల్యూఎఫ్ఎంఈ గుర్తింపు పొందుతాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 706 వైద్యకళాశాలలున్నాయి. ఈ వెసులుబాటుతో భారతీయ వైద్య కళాశాలలకు నిపుణులకు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తుంది. విదేశాలలోని వైద్య విద్యాసంస్థలకు భారత్ లోని కళాశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. వైద్య విద్యలో సరికొత్త ఆవిష్కరణలకు ఇది తోడ్పాటును అందిస్తుంది. భారత్ లో అందించే వైద్య విద్య అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉందనేందుకు డబ్ల్యూఎఫ్ఎంకి గుర్తింపు నిదర్శనం. భారతీయ వైద్య విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడైనా తమ కెరీర్ కొనసాగించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news