నేటి కాలంలో ప్రజలు ఎలా ఉన్నారంటే తమ బాధ్యత చూసుకోవాల్సిన బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిని ఎంచుకునే ముందు ఎంత భయంగా ఎవరైతే మనకు న్యాయం చేస్తారు? అభివృద్ధి చేస్తారు ? అని అలోచించి వారి వారి ఓటు హక్కును వినియోగించుకోవాలి. కానీ నేడు అలా జరగడం లేదు.. ఏ నాయకుడు అయితే అధికంగా డబ్బు ఇస్తారో వారికే తమ అమూల్యమైన ఓటును వేసి గెలిపిస్తున్నారు. ఇది ఎంత తప్పు అనేది వారికీ అప్పుడే అర్ధం కాదు.. ఏదైనా పని కోసం ఎమ్మెల్యే లేదా ఎంపీ చుట్టూ తరుగుతాము చూడు అప్పుడు తెలుస్తుంది. సరిగ్గా ఇదే విషయాన్ని అరుణాచల్ ప్రదేశ్ సీఎం గా పెమా ఖండు తెరమీదకు తీసుకువచ్చారు. ఒక వ్యక్తి తన ఓటును అమ్ముకోవడం వలనే అవినీతి బాగా పెరిగిపోయింది అన్నారు. ఎన్నికల్లో గెలవడానికి కోట్లు ఖర్చు చేసిన ఒక ఎమ్మెల్యే మళ్ళీ ఎన్నికల్లో గెలుస్తాడో లేదో తెలియక పెట్టిన డబ్బును మళ్ళీ సంపాదించుకోవడానికి అవినీతి పనులు చేస్తాడు.
దీనికి కారణం డబ్బు తీసుకుని ఓటు వేస్తున్న ప్రతి ఒక్కరు అంటూ సీఎం చెప్పారు. దీని దృష్టిలో పెట్టుకుని మనీ కల్చర్ కు వ్యతిరేకంగా నేను చేపట్టే క్యాంపైన్ లో భాగం కావాలని అభ్యర్ధించారు పెమా ఖండు.