మోదీ ప్రభుత్వం తాజాగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. చెరకు పై ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ధర (ఎఫ్ఆర్పి) పెంచాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. అయితే చెరకుపై క్వింటాల్‌కు రూ .269 చొప్పున అత్యధిక ఎఫ్‌ఆర్‌పిని ఆమోదించాలని మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకోవడం వలన చేరుకొని పండించే ఐదు కోట్ల మంది రైతులకి ఎంతో లాభదాయకంగా వుంటుంది అని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది.
ఇది ఇలా ఉండగా 2020-21 చక్కెర సీజన్లో చూస్తే… రూ. 91,000 కోట్ల విలువైన దాదాపు 2,976 లక్షల టన్నుల చెరకును చక్కెర మిల్లులు కొనుగోలు చేయడం జరిగింది. రాబోయే సీజన్ 2021-22లో అయితే దాదాపు 3,088 లక్షల టన్నుల చెరకుని చక్కెర కర్మాగారాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది అని తెలుస్తోంది. చెరకు రైతులకు మొత్తం చెల్లింపులు దాదాపు రూ .1,00,000 కోట్లు. అయితే ప్రభుత్వం వారికీ డబ్బులు సకాలంలో వచ్చేలా చూస్తామని అంది.
ఇది ఇలా ఉంటే వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్ మరియు పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ నేపథ్యం లో రైతులను ఆకర్షించడానికి చెరకు FRP పెంచాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.