బడ్జెట్ ఎఫెక్ట్ : పెరిగిన గ్యాస్ రేట్లు

-

ప్రతి నెల ఒకటో తారీకు న గ్యాస్ రేట్లు కేంద్రం మారుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నెలలో ఇంకో గ్యాస్ రేట్లు మార్చలేదు. తాజాగా అందిన సమాచారం మేరకు ఈ రోజు నుంచి గ్యాస్ రేట్లు పెంచినట్లు తెలుస్తోంది. నాన్ సబ్సిడీ సిలిండర్ మీద అ ₹25 నేటి నుంచి పెరగనుంది. దేశ రాజధాని ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ.719కి చేరింది. కోల్‌కతాలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.745 చేరింది. ముంబైలో గ్యాస్ సిలిండర్ ధర రూ.719కి చేరింది.

ఇక చెన్నైలో గ్యాస్ సిలిండర్ ధర రూ.735కి చేరింది. ఇక బెంగళూరులో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.722 కి వెళ్ళింది. హైదరాబాద్‌లో కూడా గ్యాస్ సిలిండర్ ధర 25 రూపాయలు పెరిగి 771 కి చేయింది. ఇకపోతే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా ఒకటో తేదీ రోజున ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను సమీక్షిస్తూ ఉంటాయి. బడ్జెట్లో గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇస్తున్న మొత్తాన్ని భారీగా తగ్గించడంతో ఈ మేర భారం పడిందని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news