బ్యాండ్ బాజాతో మను బాకర్ కు దిల్లీ ఎయిర్ పోర్టులో గ్రాండ్ వెల్ కమ్

-

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత షూటర్ మను బాకర్ రెండు పతకాలు సాధించిన విషయం తెలిసిందే. ఈ పతకాలతో మను హిస్టరీ క్రియేట్ చేసింది. అప్పటి నుంచి మను బాకర్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. సోషల్ మీడియాలో అయితే మనూ విక్టరీపై ట్రెండ్ కొనసాగుతోంది. ప్రతిఒక్కరూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆమె తన పతకాలతో భారత్లోకి అడుగుపెట్టింది.

మనూ పాటు కోచ్ జస్పల్ రానా కూడా దిల్లీ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ వద్ద వీరికి ఘన స్వాగతం లభించింది. చాలా మంది మనూ బాకర్ను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దేశానికి రెండు మెడల్స్ తీసుకువచ్చిన మనూను మనస్ఫూర్తిగా ప్రశంసించారు. ఇక డప్పు చప్పుళ్లు, బాణాసంచాల మధ్య గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. మనూపై పూల వర్షం కురిపించారు. మనూతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. శెభాష్ షేర్నీ, వెల్ కమ్ షేర్నీ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు స్వాగతం పలికారు.

Read more RELATED
Recommended to you

Latest news