అహ్మదాబాద్ బాంబు పేలుళ్లు.. సుమారు 15ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటన అప్పట్లో కలకలం రేపింది. ఈ కేసులో నిందితుడు లష్కరే తొయీబా ఉగ్రవాది అబ్దుల్ రజా గాజీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అతన్ని అరెస్టు చేసింది. 2006, ఫిబ్రవరి 19న అహ్మదాబాద్‌లోని కలుపూర్ రైల్వేస్టేషన్లో బాంబు పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పదిమందికిపైగా గాయపడ్డారు.
అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న ఉగ్రవాది గాజీని పశ్చిమబెంగాల్ పోలీసుల సహకారంతో ఏటీఎస్ పోలీసులు గురువారం సాయంత్రం బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని బషీర్ఘాట్ వద్ద అరెస్టు చేయడం గమనార్హం. బాంబు పేలుళ్లకు ప్రధాన నిందితుడు అస్లామ్ కశ్మీరీ, ఇలియాస్ సమర్ మెమెన్‌లకు గాజీ ఆశ్రయం కల్పించాడు. పేలుళ్ల తర్వాత ఈ ఇద్దరు ఉగ్రవాదులు కశ్మీర్‌కు పరారయ్యారని, అలాగే 26,,,,11 ముంబై బాంబు పేలుళ్ల నిందితుడు అబు జిందాల్‌కు సరిహద్దు దాటడానికి గాజీ సహకరించాడని పోలీసులు తెలిపారు.