సమోసాల్లో గుట్కాలు, కండోమ్స్ !

-

క్యాంటీన్ కాంట్రాక్ట్ కాన్సెల్ చేశారని కోపంతో సమోసాల్లో గుట్కాలు, కండోమ్స్ వేసాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని ఓ క్యాంటీన్‌లో సమోసాల్లో గుట్కాలు, కండోమ్స్, రాళ్లు కనిపించాయి.

అయితే.. దీనిపై పోలీసులు ఆరా తీశారు. పుణేలోని ఓ కంపెనీ తన క్యాంటీన్ క్యాటరింగ్ కాంట్రాక్టరును తొలగించారని దీంతో అతడు పగ పెంచుకుని కొత్త క్యాటరింగ్ సంస్థలో తన మనుషులను పనికి పెట్టి కంపెనీకి చెడ్డ పేరు తీసుకురావడానికే ఈ నీచానికి పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. దీనికి పాల్పడిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news