హర్యానా ఘర్షణలు.. జడ్జి కారుపై అల్లరి మూకల దాడి.. జస్ట్ మిస్

-

ఇప్పటికే జాతుల మధ్య వైరంతో మణిపుర్ రాష్ట్రం అట్టుడికిపోతుంటే.. తాజాగా హర్యానాలో ఇరు వర్గాల మధ్య హింస చెలరేగి ఆ రాష్ట్రాన్నీ కుదిపేస్తోంది. గత మూడు రోజులుగా హర్యానాలో అల్లర్లు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా నూహ్ జిల్లాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణల్లో హర్యానాకు చెందిన ఓ జడ్జి, ఆమె మూడేళ్ల కుమార్తె త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించి దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

సోమవారం ఘర్షణలు చోటుచేసుకున్న సమయంలో అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ జస్టిస్ అంజలి జైన్, ఆమె మూడేళ్ల కుమార్తె ప్రయాణిస్తున్న కారుపై అల్లరిమూక దాడి చేసింది. రాళ్లతో దాడి చేసి కారుకు నిప్పంటిచారు. ఆ సమయంలో కారులో జడ్జితో పాటు కొందరు సిబ్బంది కూడా ఉన్నారు. వారంతా కారు దిగి నూహ్‌లోని పాత బస్టాండ్‌కు వెళ్లి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటనపై కోర్టు సిబ్బంది గుర్తు తెలియని దుండగులపై కేసు పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news