హసన్‌ ఎంపీ అభ్యర్థి ప్రజ్వల్‌ రేవణ్ణను సస్పెండ్‌ చేసిన జేడీఎస్‌

-

హాసన్‌ ఎన్డీయే ఎంపీ అభ్యర్థి, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణను జేడీఎస్‌ సస్పెండ్‌ చేసింది. మహిళలపై లైంగికదాడి, వేధింపులకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లు బయటకు రావటంతో ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఈ వ్యవహారంపై చర్చించేందుకు ఇవాళ హుబ్బళ్లిలో జేడీఎస్‌ కోర్ కమిటీ సమావేశం అయింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ నివేదిక వచ్చేవరకు ప్రజ్వల్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు జేడీఎస్‌ అగ్రనేత, మాజీ సీఎం హెచ్‌.డి.  కుమారస్వామి తెలిపారు. ఆయనకు షోకాజు నోటీసు కూడా జారీ చేసినట్లు.. కోర్‌ కమిటీ భేటీ తర్వాత కుమారస్వామి వెల్లడించారు.

ఈ పరిణామానికి ముందు ప్రజ్వల్ బాబాయ్, కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ.. ఈ వివాదం వెనక కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ హస్తం ఉందని ఆరోపించారు. ఆ వీడియోల్లో ప్రజ్వల్ ముఖం కనిపిస్తోందా..? అవి అతడివేనన్న ఆధారం ఏంటి..? అయినా సరే నైతికత ఆధారంగా చర్యలు ఉంటాయి’’ అని కుమార స్వామి వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news