పన్నూపై హత్యాయత్నంపై వాషింగ్టన్‌ పోస్టు స్టోరీపై భారత్ రియాక్షన్ ఇదే

-

సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూపై అమెరికాలో జరిగిన హత్యా కుట్రలో ఇండియన్ “రా” ఏజెన్సీ పాత్ర ఉందంటూ వాషింగ్టన్‌ పోస్టు ఓ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ కథనంపై తాజాగా భారత విదేశాంగ శాఖ స్పందించింది.  అవి అసంబద్ధమైన, నిరాధారమైన  ఆరోపణలని కొట్టిపారేసింది. వ్యవస్థీకృత నేరగాళ్లు, ఉగ్రవాదులు, ఇతరుల నెట్‌వర్క్‌లపై అమెరికా ప్రభుత్వం అందించిన నివేదికను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపింది.

దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో ఇలాంటి ఊహాజనితమైన, బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు, కథనాలు ఏ మాత్రం ప్రయోజనం చేకూర్చవని విదేశాంగ శాఖ తీవ్రంగా ఫైర్ అయింది. గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు కుట్ర జరిగిందంటూ గతేడాది అమెరికా ఆరోపించిన విషయం తెలిసిందే. కుట్రలో భారత గూఢచర్య సంస్థ రా అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ తాజాగా వాషింగ్టన్‌ పోస్ట్‌ వార్తా పత్రిక ఒక కథనాన్ని ప్రచురించడంతో తాజాగా భారత్ స్పందించింది.

Read more RELATED
Recommended to you

Latest news