ఉత్తర భారతాన్ని వర్షాలు వంటిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటివరకు వేర్వేరు ఘటనల్లో 37 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. హర్యానా అంబాలాలో హాయ్ అలర్ట్ కొనసాగుతుండగా… హిమాచల్ ప్రదేశ్ లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఢిల్లీ, ఉత్తరాఖండ్ లోను భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. భారీ స్థాయిలో వరదలు, కొండ చరియలు విరిగిపడటంతో చాలా చోట్ల రవాణా వ్యవస్థ నిలిచిపోయింది.
కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో 3 రోజుల పాటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.