అయోధ్య రాముడి దర్శనానికి భారీగా పోటెత్తిన భక్తులు

-

అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కన్నులపండువగా జరిగింది. కోట్ల హిందువుల 500 ఏళ్లనాటి కల ఎట్టకేలకు సాకారమైంది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి బాలరాముడి దర్శనానికి భక్తులను అనుమతించారు. ఇందులో భాగంగా అయోధ్యకు తెల్లవారుజామునే భారీగా భక్తులు పోటెత్తారు. కొత్త మందిరంలో కొలువుదీరిన రామ్ లల్లాను దర్శించుకునేందుకు తెల్లవారుజాము 3 గంటలకే క్యూ లైన్లలో నిల్చుకున్నారు.

ఈరోజు ఉదయం ఏడు గంటల సమయంలో రాముడికి హారతి ఇచ్చిన అనంతరం భక్తులకు స్వామి వారిని దర్శించేందుకు అనుమతి ఇచ్చారు. ఆలయానికి వెళ్లే వారు తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు కార్డును తీసుకెళ్లాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సూచించింది. అయితే ఉదయం హారతి కార్యక్రమానికి పరిమితంగా ఉచిత పాస్లు అందించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్యకు వస్తుండటం వల్ల ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది.

మరోవైపు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ దర్శనం, హారతి వేళల వివరాలను వెబ్సైట్లో వెల్లడించింది. ఉదయం 7 నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనానికి అనుమతి ఇచ్చారు. దర్శనం కోసం ఒక రోజు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version