భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేకపోవడం హాస్యాస్పదం: ఎలాన్‌ మస్క్‌

-

ఐక్యరాజ్యసమితి పనితీరుపై ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐరాస, దాని అనుబంధ సంస్థల్లో మార్పులు అవసరమని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేకపోవడాన్ని తప్పుబట్టారు. శక్తిమంతమైన దేశాలు తమ సభ్యత్వాన్ని వదులుకోలేక పోతున్నాయంటూ విమర్శించారు. ఆఫ్రికా యూనియన్‌కు సమష్టిగా ఒక శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.

ఇంతకీ ఏం జరిగిందంటే..?

భద్రతా మండలిలో ఏ ఆఫ్రికా దేశానికీ శాశ్వత సభ్యత్వం లేకపోవడంపై ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ఇటీవల ‘ఎక్స్‌ (ట్విటర్‌)’ వేదికగా పోస్ట్‌ చేశారు. అంతర్జాతీయ సంస్థలు నేటి ప్రపంచాన్ని ప్రతిబింబించేలా ఉండాలని అభిప్రాయపడ్డారు. దీంతో భద్రతా మండలిలో దేశాల శాశ్వత సభ్యత్వంపై చర్చ మొదలైంది. ఈ పోస్ట్‌పై అమెరికాకు చెందిన పెట్టుబడిదారు మైఖెల్‌ ఐసెన్‌బర్గ్‌ బదులిస్తూ ‘మరి భారత్‌ సంగతేంటీ?’ అని ప్రశ్నించారు. దీనిపై ఎలాన్‌ మస్క్‌ స్పందిస్తూ.. ‘‘ఐరాస, దాని అనుబంధ సంస్థలను సవరించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్‌కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం హాస్యాస్పదమని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version