రేపు అహ్మదాబాద్ వేదికగా టీమిండియా వర్సెస్ ఆసీస్ మధ్య ఫైనల్ పోరు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే అహ్మదాబాద్ సిటీ పోలీసుల గుప్పిట్లోకి వెళ్లింది. వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా సిటీ వ్యాప్తంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫైనల్ మ్యాచ్ కి ముఖ్య అతిథులుగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ రానున్నారు.
ఈ మేరకు అత్యున్నత సమావేశం నిర్వహించారు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. అటు స్టేడియం పరిసరాల్లో 4,500 మంది పోలీసులతో గట్టి భద్రత ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఇండియా పాక్ మ్యాచ్ కి అగంతకుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని సమాచారం అందుతోంది. స్టేడియంలో బాంబ్ బ్లాస్ట్ లు జరుగుతాయని పోలీసులకు అగంతకుల నుంచి కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో.. అహ్మదాబాద్ స్టేడియం పరిసరాల్లో హై అలెర్ట్ ప్రకటించారు పోలీసులు. స్టేడియం వైపు మెట్రో రైళ్ల సంఖ్య పెంచారు.