ఈజిప్టులో మోడీకి అత్యున్నత పురస్కారం

-

భారత ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన రెండు దేశాల పర్యటన నేటితో ముయ్యనుంది. మొదట అమెరికాలో పర్యటించిన మోదీ ఇప్పుడు ఈజిప్ట్ పర్యటనలో ఉన్నారు ఈజిప్టు ను సందర్శించిన తొలి భారత ప్రధానమంత్రి ఈయనే. ఈజిప్టు పర్యటనలో ఉన్న ప్రధాని మోడీకి ఆ దేశం అరుదైన పురస్కారాన్ని అందించింది. ఈజిప్టులోని అత్యున్నతమైన పురస్కారంగా పిలవబడే “ఆర్డర్ ఆఫ్ ద నైల్” ను ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్ సి సి చేతుల మీదుగా మోడీ అందుకున్నారు.

కాగా ఈజిప్టులో పర్యటిస్తున్న మోదీ నేడు 1000 ఏళ్ల నాటి పురాతన మసీదును సందర్శించారు. 1970లో ఆ మసీదును దావూదీ బొహ్ర సామాజిక వర్గం ముస్లింలు పునరుద్ధరించారు. ప్రస్తుతం ఈ మసీదు పర్యవేక్షణ వారి అధీనంలోనే కొనసాగుతోంది. అనంతరం ఆయన హెలియోపోలీస్ అమరవీరుల యుద్ధవాటికను సందర్శించారు. అమరవీరులకు నివాళి అర్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news