డ్రగ్స్ కేసులో ఆరోపణలపై స్పందించిన సురేఖ వాణి

-

టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన డ్రగ్స్ కేసులో కబాలి ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ కృష్ణ ప్రసాద్ చౌదరిపై నిఘా పెట్టిన మాదాపూర్ ఎస్ఓటి, రాజేంద్రనగర్ పోలీసులు కిస్మత్ పురలో ఆయనని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 12వ తేదీన రాత్రి అతడిని అరెస్టు చేసి ఉప్పరపల్లి కోర్టు అనుమతితో రాజేంద్రనగర్ పోలీసులు ఆయనని కస్టడీలోకి తీసుకొని విచారించారు. అతడి మొబైల్ కాల్ డేటా, వాట్సప్ చాటింగ్ ను ఢీకోడ్ చేసి వాటి ఆధారంగా వివరాలు సేకరించారు.

 

చౌదరి కాల్ లిస్ట్, వాట్సప్ లో బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి, నటి సురేఖ వాణి, జ్యోతి ఫోన్ నెంబర్లను గుర్తించారు. అయితే డ్రగ్స్ కేసులో తనపై వస్తున్న ఆరోపణలపై తాజాగా సురేఖా వాణి స్పందించారు. ఆ ఆరోపణలన్నీ అవాస్తవమని తెలిపారు. ఈ ఆరోపణల వల్ల తమది, పిల్లల భవిష్యత్తు, ఫ్యామిలీ పరువు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమపై తప్పుడు రూమర్స్ సర్క్యులేట్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు సురేఖ వాణి.

Read more RELATED
Recommended to you

Latest news