రిజర్వేషన్లను ఎన్ని తరాల వరకు కొనసాగిస్తారు ? ప్రశ్నించిన సుప్రీం కోర్టు..! 

-

ఉద్యోగాలు, విద్యలో ఎన్ని తరాల వరకు రిజర్వేషన్లను కొనసాగిస్తారో తెలియజేయాలని సుప్రీం కోర్టు కోరింది. ఈ మేరకు కోర్టు మరాఠా కోటా కేసు విచారణ సందర్భంగా పిటిషనర్లను ప్రశ్నించింది. రిజర్వేషన్లను మొత్తం 50 శాతం పరిమితికి మించి అమలు చేయాల్సి వస్తే అసమానతలు నెలకొంటాయని ఆందోళన వ్యక్తం చేసింది. రిజర్వేషన్ల కోటాను అమలు చేయడంలో మారిన పరిస్థితుల నేపథ్యంలో వాటిపై పునః పరిశీలన అవసరం అని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు ధర్మాసం మహారాష్ట్ర తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గికి సూచించింది.

మారిన పరిస్థితుల దృష్ట్యా రిజర్వేషన్ కోటాల సమస్యలను పరిష్కరించడానికి కోర్టులు వాటిని రాష్ట్రాలకు వదిలివేయాలని 1931 జనాభా లెక్కల ప్రకారం మండల్ తీర్పులో ప్రతిపాదించారు. అయితే మరాఠాలకు కోటా మంజూరు చేసే మహారాష్ట్ర చట్టానికి అనుకూలంగా వాదించిన రోహత్గి.. ఇంద్ర సాహ్నీ కేసు అని కూడా పిలువబడే మండల్ తీర్పులోని వివిధ అంశాలను ప్రస్తావించారు. ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన వారికి 10 శాతం కోటా అమలు చేయాలన్న కేంద్రం నిర్ణయం కూడా 50 శాతం కోటాను ఉల్లంఘించినట్లే అవుతుందని అన్నారు.

1931 జనాభా లెక్కల ప్రకారం ప్రతిపాదించబడిన మండల్ తీర్పును తిరిగి పరిశీలించడానికి చాలా కారణాలు ఉన్నాయని, అంతేకాకుండా జనాభా చాలా రెట్లు పెరిగి 135 కోట్లకు చేరుకుందని రోహత్గి చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచిపోయాయని, రాష్ట్రాలు ఎంతో ప్రయోజనకరమైన పథకాలను కొనసాగిస్తున్నాయని,  ఏ అభివృద్ధి జరగలేదని, వెనుకబడిన కులాలు ఏవీ ముందుకు సాగలేదని తాము అంగీకరిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది.

కాగా ఈ కేసులో వాదనలు సోమవారం తిరిగి ప్రారంభమవుతాయి. మహారాష్ట్రలో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాలలో మరాఠాలకు కోటా మంజూరు చేయడాన్ని సమర్థించిన బాంబే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ నమోదైన పిటిషన్‌ ను సర్వోన్నత న్యాయస్థానం విచారిస్తోంది. అందులో భాగాంగానే ఆ వాదనలు జరిగాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version