తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
మరట్వాడా అలానే పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, విదర్భ పరిసర ప్రాంతాల్లో 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించింది అని వాతావరణ శాఖ వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ఇక మరో పక్క ఎండలు కూడా దంచికొడుతున్నాయి. ఈ సమయంలో వర్షాలు అంటే కాస్త ఉపశమనమే మరి.